మూవీ న్యూస్ మూవీ రివ్యూస్ రాజకీయం

టీడీపీని దూరం పెట్టేలా చేయడంలో గవర్నర్ నరసింహన్ దే .. ప్రధాన పాత్ర.

టీడీపీ-బీజేపీ మధ్య చిచ్చుపెట్టిన చిత్రగుప్తుడు.. గవర్నర్ నరసింహనే. పవన్ కల్యాణ్ ను… చంద్రబాబు నుంచి దూరం చేస్తే..టీడీపీ పనైపోతుందని… లెక్కలు వేసి ..మోదీని, అమిత్ షాను బుట్టలో వేసి..తన పదవిని కాపాడుకున్నారు నరసింహన్. టీడీపీ – బీజేపీ మధ్య విబేధాలకు అనేక అంశాలు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ… అసలు కారణం మాత్రం… గవర్నర్ నరసింహన్ . గవర్నర్ గా … కాంగ్రెస్ హయాంలో నియమితులైనా… బీజేపీ పాలకుల ప్రాపకాన్ని కూడా సంపాదించిన గవర్నర్… అప్రతిహతంగా తన పదవిలో కొనసాగుతున్నారు. నరేంద్రమోదీ, అమిత్ షా వంటి వాళ్లను మెప్పించాలంటే… ఎంతగా స్వామి భక్తి ప్రదర్శించాలో.. సాధారణ ప్రజల కంటే… బీజేపీ నేతలకే ఎక్కువ తెలుసు. నరేంద్రమోదీ, అమిత్ షాలను.. ఎలా మెప్పించారంటే.. ఎప్పటికప్పుడు… చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలివ్వడం వల్ల మెప్పించారు.
గవర్నర్ నరసింహన్… మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. అధికారుల్ని అవమాన పరిచిన సంఘటనలున్నాయి. అందుకే..ఏపీ ప్రభుత్వ అధికారులు కానీ..మంత్రులు కానీ… రాజ్ భవన్ వైపు వెళ్లడం దాదాపుగా తగ్గించేశారు. కానీ నరసింహన్ మాత్రం… ఏపీ ప్రభుత్వంపై .. ఫిర్యాదులు మాత్రం నివేదిక రూపంలోనే పంపుతూనే ఉన్నారు. చివరికి పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ చేతులెత్తేసినప్పుడు … కొత్త కాంట్రాక్టర్ కు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణియంచారు. చివరికి ఇందులోనూ మతలబు ఉందని.. గవర్నర్ కేంద్రానికి ఫిర్యాదు పంపారు. ఈ విషయాలన్నీ తెలిసిన ఓ కేంద్రమంత్రి… తనకు సన్నిహితుడితో… చంద్రబాబు అంటే గవర్నర్ కు ఎందుకు కోపమని ప్రశ్నించారు కూడా. గవర్నర్ నివేదికలతోనే… ప్రధాని మోదీ..చంద్రబాబుపై ద్వేషభావాన్ని పెంచుకుని… అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని.. పవన్ కల్యాణ్ .. ఎదురు తిరిగితే… చంద్రబాబు మరింత బలహీనపడతారని… కూడా ప్రధానికి గవర్నర్ నివేదిక ఇచ్చారు. గవర్నర్ నేరుగా రంగంలోకి దిగి.. పవన్ కల్యాణ్ తో చర్చలు ప్రారంభించారు. రాజ్ భవన్ లో జరిగిన ఓ విందుకు..ఎప్పుడూ లేని విధంగా పవన్ కల్యాణ్ ను రాజ్ భవన్ అధికారులు ఆహ్వానించారు. అప్పుడు గవర్నర్ తో ప్రారంభమైన చర్చలు.. ఆ తర్వాత కూడా కొనసాగాయి. గవర్నర్ తరచూ పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసేవారు. ఐవైఆర్ కృష్ణారావును కూడా గవర్నర్ పిలిచి చర్చలు జరిపారు. చంద్రబాబును రాజకీయంగా బలహీనం చేయవచ్చుననే ఆశలు రేపుతూ….. ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు వ్యతిరేకంగా నివేదికలిస్తూ… బీజేపీ అగ్రనాయకత్వం ..టీడీపీని దూరం పెట్టేలా చేయడంలో గవర్నర్ నరసింహన్ దే .. ప్రధాన పాత్ర.