మూవీ న్యూస్

సుభాషిణికి చిరంజీవి 2 ల‌క్ష‌ల ఆర్థికసాయం

తెలుగునంది హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యల్లో ఉన్న నటీనటులకు సాయం చేయడంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నటుడు గుండు హనుమంతరావుకు ఆయన రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు మరో నటుడు పొట్టి వీరయ్య ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుని రూ.2 లక్షల చెక్కు పంపించారు. ఇలా పలు సందర్భాల్లో చిరు తన మంచి మనసును చాటుకున్నారు.
కాగా తాజాగా నటి ‘అల్లరి’ సుభాషిణికి కూడా సాయం చేశారు. ఆమె కొన్ని రోజులుగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. తాజాగా ఆమె ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకున్న చిరంజీవి రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేసారు. చిరు చిన్న కుమార్తె శ్రీజ బుధవారం సుభాషిణి ఇంటికి వెళ్లి చెక్కు అందించారు. అనంత‌రం చిరు ఫోన్ చేసి సుభాషిణి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య విష‌య‌మై దిగులు పడొద్ద‌ని మ‌నోధైర్యాన్ని ఇచ్చారు