మూవీ న్యూస్

హైదరాబాద్ లో విజయ్ సేతుపతి కొత్త మూవీ ప్రీ రిలీజ్ వేడుక!

తెలుగునంది హైదరాబాద్: కొంత మంది దర్శకులు ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో అదే కథను వేరొక హీరోతో చేయాల్సి వస్తుంది. తన పరిస్థితి కూడా అంతే అంటున్నారు ‘విజయ్ సేతుపతి’ దర్శకుడు విజయ్ చందర్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘సంగతమిళన్’. రాశీఖన్నా హీరోయిన్. నివేద పేతురాజ్ మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈనెల 15న రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.

కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ చందర్, ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత రావూరి వి.శ్రీనివాస్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు మరియు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ & కంచర్ల ఫౌండేషన్ అధినేత శ్రీకాంత్ కంచర్ల, మరియు జర్మన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇండో-యూరో సింక్రొనైజేషన్ – ఫౌండర్ వెంకట్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ చందర్ ఆశ్చర్యకర విషయాలు చెప్పుకొచ్చారు. అసలు ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని చెప్పారు. కానీ, ఆయన రాజకీయాలతో బిజీ అయిపోవడంతో విజయ్ సేతుపతితో చేశానని అన్నారు.

 

Add Comment

Click here to post a comment