మూవీ రివ్యూస్ రాజకీయం

అవిశ్వాసం పెట్టే మొనగాళ్లు…మోడీతో ఎందుకు సమావేశం పెట్టారు ?

యుద్ధం ప్రకటించాక ఎవడైనా ప్రత్యర్థి ఇంటికి భోజనానికి వెళతాడా ? అలాంటి సీన్ ఎక్కడైనా చూశామా ? జగన్ గుంటనక్క రాజకీయం ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. ఇదిగో ఫోటో కూడా ఉంది చూడండి !

సాయిరెడ్డి మోడీ ఆఫీసుకి వెళ్లాడు. అక్కడ వెయిట్ చేస్తూ దొరికిపోయాడు. సాయిరెడ్డితో పాటు వినీత్ రెడ్డి కూడా ఉన్నాడు. వినీత్ రెడ్డి జగన్ సమీప బంధువు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కూడా. ఆర్థిక వ్యవహరాల్లో వినీత్ జగన్ కి సన్నిహితంగా ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతాయ్. అలాంటిది వీళ్లద్దరూ మోడీ ఆఫీసులో సమావేశం కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఇది కొద్ది నిమిషాల కిందటి పీఎంవోలో దృశ్యం. ఏంటి మోడీతో సాయి రెడ్డికి పని ? కుంభకోణాల్లో ఇరుక్కొని ఏ1, ఏ2గా ఉన్న వాళ్లతో మీకు పనేంటి అని చంద్రబాబు కూడా నిన్న ప్రశ్నించాడు.

అసలు పాయింట్ అదే కదా ! మరి ఎందుకు ఇలా జరుగుతోంది ? ఏం మాట్లాడతాడు సాయిరెడ్డి మోడీతో ? మోడీకి అప్పాయింట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? అదే పాయింట్ ఇప్పుడు. జగన్ పార్టీ మోడీ చెప్పినట్టల్లా ఆడుతోంది అనేందుకు ఇంతకన్నా రుజువు ఏముంటుంది ?

ఏపీకి సాయం చేయక్కర్లేదు అని రిపోర్టులు ఇచ్చింది జగన్ పార్టీనే, సాయం ఆపించింది జగన్ పార్టీనే, పోలవరానికి కొర్రీలు వేయించింది కూడా జగన్ పార్టీనే అనేందుకు ఇంతకన్నా ఎగ్జాంపుల్ మరోటి లేదు !‌ ఇదంతా కుమ్మక్కు కుట్ర వ్యవహారం. రేపు పార్లమెంటులో పెడతామంటున్న అవిశ్వాసం కూడా ఇలాంటి డ్రామానే !అంటే ఇప్పుడు జగన్ పార్టీని మోడీనే నడిపిస్తున్నాడన్న మాట.

ఆదేశాలు అన్నీ ఢిల్లీ బీజేపీ నుంచే వస్తున్నాయ్ అనమాట. అవిశ్వాసం అంతా డ్రామా. ప్రత్యేక హోదా డిమాండ్ కూడా నాటకం. జగన్ బూటకం అని తేలిపోయింది ఇఫ్పుడు. దీని మీద సాయిరెడ్డి, జగన్ ఏం సమాధానం చెబుతారు ? విపక్షంగా ఉన్న కోన్ కిస్కా పార్టీ వారానికో సారి మోడీతో ఎందుకు సమావేశం అవుతోంది ? అది కూడా మోడీ ఏపీకి సాయం చేయడం లేదు… చేయలేం… చేయం… అని చెప్పేశాక మీటింగ్ లు వెనక సంగతేంటి ? వైసీపీ బీజేపీ కలిసి ఇప్పుడు ఏపీని తొక్కి పెట్టాలనుకుంటున్నాయ్ తేలిపోయింది సంగతి !