మూవీ రివ్యూస్

ఉన్నది ఒక్కటే జిందగీ రివ్యూ -Telugunandi.

నిర్మాణ సంస్థ :  స్ర‌వంతి సినిమాటిక్స్‌, పి.ఆర్‌.సినిమాస్‌
తారాగ‌ణం : రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, శ్రీ విష్ణు, ప్రియ‌దర్శి, కిరిటీ, రాజ్ మాదిరాజ్ త‌దిత‌రులు|
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాతః కృష్ణ‌చైత‌న్య‌

ద‌ర్శ‌క‌త్వంః కిషోర్ తిరుమ‌ల‌

స్నేహం ప్లస్ ప్రేమ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి… అప్పట్లో వచ్చిన ప్రేమదేశం కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది… ముఖ్యంగా అందులో ఫ్రెండ్షిప్ మీద పాటలు, ప్రేమ ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటాయి… దాదాపుగా ఆకోవకి చెందిన సినిమానే ఈ ఉన్నది ఒక్కటే జిందగీ. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రిలేషన్స్ ఉంటాయి… కానీ స్నేహం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎలాంటి అరమరికలు లేకుండా మనం మనంలా కేవలం ఒక ఫ్రెండ్ దగ్గరే ఉండగలం. ఇదే పాయింట్ గట్టిగా టచ్ చేశాడు దర్శకుడు.

క‌థః అభి(రామ్‌), వాసు(శ్రీవిష్ణు) చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసే పెరుగుతారు. అభి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది, ఆభాద నుండి వాసు (శ్రీవిష్ణు) బయటకి తీసుకువస్తాడు… కాస్త ఉన్నత కుట్టుంబానికి చెందిన రామ్ కి వేరే ఊరిలో పెద్ద స్కూల్ లో సీట్ వస్తే వాసుని వదలి వెళ్లలేక ఆసీటుని వదులుకుంటాడు. అక్కడ నుండి వారి స్నేహం చాలా దృడంగా వారితో పాటు పెద్దదౌతుంది. వాసు ఒక ప్రాజెక్ట్ పని మీద డిల్లీ వెళుతాడు. ఆసమయంలో మహా (అనుప‌మ )పరిచయం అవ్వడం ఆమె ప్రేమలో అభిపడడం జరిగిపోతుంది. ఆ పరిచయంలో మెడిసన్ చదువుతున్న మహాకి సింగర్ అవ్వాలనే కోరిక ఉంట్టుంది, స్వతాగా గిటార్  ప్లేయర్ అయిన అభీ, మహా కోరిక తీరుస్తాడు.

ఇంతలో డిల్లీ నుండి వచ్చిన వాసు కి మహా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం , మహా ని ఆల్రడీ ఇష్టపడం జరిగిపోతుంది… ఇక్కడ ఫ్రెండ్స్ ఇద్దరు తాము ఇష్టపడుతున్నది ఒకటే అమ్మాయినని చెప్పేసుకుని మహాని వెళ్లి అడుగుతారు.. మహా మాత్రం వాసుని ఇష్టపడుతుంది.. చిన్న అండస్టాండింగ్ ప్రాబ్లం వలన అభి,వాసు గొడవపడి విడిపోతారు. అభి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు… నాలుగు సంవత్సరాల తరువాత స్నేహితుడి పెళ్లికోసం అందరు ఒక చోట కలుస్తారు… వెడ్డింగ్ ప్లానర్ గా మ్యాగి (లావణ్య) వస్తుంది… అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వలన అభి , వాసు ఒకటి అవుతారు… కాని మ్యాగి ని ఇద్దరు ఇష్టపడుతున్నారని స్నేహితుడు బావించడం వలన అభి మళ్లీ చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోవాలనుకుంటాడు… ఇక్కడ ఏంజరుగుతుందో… తెర మీద చూడాల్సిందే…

ప్ల‌స్ పాయింట్స్ః

>రామ్ న‌ట‌న‌

> దేవిశ్రీ సంగీతం

>బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

>సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్

> క‌థ చాలా స్లోగా ఉంది

విశ్లేష‌ణ:జీవితంలో స్నేహం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు… కాస్తింత స్నేంహం డోసు ఎక్కువ అయ్యింది. అయినా కూడా కథా పరంగా బాగానే ఉంది. సినిమా ని డైరెక్టర్ చాలా క్లారిటీ గా నడిపించాడు… ఎలాంటి హంగు , ఆర్బాటాలు.. పనికి మాలిన ట్విస్ట్లు జోలికి వెళ్లకుండా… ఏ సీన్ కి ఆసీన్ తేల్చి పారేశాడు… ప్రతి సీన్లోను ఎంటర్టైన్మెంట్ ఉండేటట్లు జాగ్రత్త పడడం వలన సినిమా భోరు కొట్టదు. రామ్ తనకి తగిన కథ ని ఏంచుకుంటే… ఆ సినిమాకి 100 శాతం న్యాయం చెయ్యగలడని నిరూపించాడు.

రామ్ స్నేహితులుగా యాక్ట్ చేసినవాళ్లు అందరు సరదాగా వాళ్ల పాత్రలకి న్యాయం చేశారు… సినిమాకి హైలెట్ మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్… ప్రతి సీన్ కి యాప్ట్ అయ్యే మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకుడికి భోర్ లేకుండా చేశాడు… సేకంట్ హాఫ్ కాస్త స్లో అయ్యింది… అయినా కూడా క్లైమాక్స్ మాత్రమే ట్విస్ట్… చక్కటి ట్విస్ట్… ప్రేమ, స్నేహం , త్యాగం, అమ్మాయి మనసు, స్నేహితుడి అభిమానాన్ని దర్శకుడు చక్కగా టచ్ చేశాడు…

“బెస్ట్ ఫ్రెండ్” ఉన్న ప్రతి ఒక్కలకి  సినిమా ఖచితంగా నచ్చుతుంది.

TeluguNandi రేటింగ్ః 3/5