ఆరోగ్యం ఫోటో గ్యాలరీ మూవీ న్యూస్ మూవీ రివ్యూస్ రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

కష్టపడడాన్ని విద్యార్థి దశ నుండే విద్యార్థులు అలవాటు చేసుకోవాలి – శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది కందుకూరు:  విద్యార్థులు విద్యతోనే ఉన్నత భవిష్యత్తును పొందవచ్చని zptc సభ్యులు శ్రీకాంత్ కంచర్ల పేర్కొన్నారు.
పొన్నలూరు మండలంలోని ముండ్లమూరివారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు కంచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత  రోబోటిక్స్ వర్క్ షాప్ ప్రకాశం ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్వహించారు.

మొదటగా  పాఠశాలలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శ్రీకాంత్  పలు సూచనలను, మంచి విషయాలను తెలిపారు. కష్టపడడాన్ని విద్యార్థి దశ నుండే విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. కష్టపడి బాగా చదివినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను బాగా చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కంచర్ల ఫౌండేషన్ ఛైర్మెన్ కంచర్ల శ్రీకాంత్ చౌదరి మాట్లాడుతూ మంచి విద్యతోనే విద్యార్థుల కుటుంబాలు మారుతాయి అని అన్నారు. విద్యార్థులు ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.మాధవరావు, ప్రకాశం జిల్లా వాసవిసేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీకాంత్
శ్రీకాంత్

Add Comment

Click here to post a comment