మూవీ రివ్యూస్ వీడియోస్

జవాన్ రివ్యూ!

హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కెరియర్ మొదట్లో వరుస హిట్స్ కొట్టిన తేజు , ఆ తర్వాత తిక్క , విన్నర్, నక్షత్రం వంటి వరుస ప్లాప్స్ తో డీలా పడ్డాడు. ఈ నేపథ్యం లో రైటర్ బివిఎస్ రవి చెప్పిన దేశ భక్తి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి , తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సాయిధరమ్‌తేజ్‌, మెహరీన్‌, ప్రసన్న ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ, ఈరోజు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.. మరి ఈ జవాన్ తేజు కు ఎలాంటి హిట్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
కథ : జై(సాయిధ‌ర‌మ్ తేజ్‌), కేశ‌వ‌(ప్ర‌స‌న్న‌)లు చిన్నప్పుడు మంచి స్నేహితులు..కాకపోతే వీరిద్దరి మైండ్ సెట్ వేరు..జై దేశం కోసం ప్రాణం ఇచ్చే టైపు అయితే , కేశ‌వ‌ మాత్రం దేశం కన్నా డబ్బే ముఖ్యం అనుకునేవాడు..డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధం గా ఉండే మనస్త్వం కేశవది. దీంతో జై అతడి నుండి దూరంగా ఉంటూ బాగా చదువుకుని డీఆర్‌డీలో శాస్త్రవేత్తగా చేరాలనే అంశం తో పెరుగుతాడు. కేశవ పెద్దవాడయ్యాక మాఫియాతో చేతులు కలుపుతాడు.
కానీ జై కి ఈ విషయం తెలియదు. క‌థ ఇలా నడుస్తున్న క్ర‌మంలో..దేశ ర‌క్ష‌ణ కోసం డి.ఆర్‌.డి.ఒ. అక్టోప‌స్ అనే మిసైల్‌ను త‌యారు చేస్తుంది. ఈ మిసైల్‌ను సొంతం చేసుకుని ఇండియాను నాశనం చేయాలనీ శ‌త్రుదేశాలు ప్ర‌య‌త్నిస్తాయి. ఆ మిసైల్‌ను దొంగ‌లించే డీల్‌ను కేశ‌వ‌కు అప్పగిస్తారు. అయితే స్టాంపుల‌ను త‌యారు చేసే వ్య‌క్తి(కోట శ్రీనివాస‌రావు) వ‌ల్ల డి.ఆర్‌.డి.ఒకి సంబంధించి ఏదో జ‌రుగుతుంద‌ని జైకి తెలుస్తుంది. జై వేసే ఓ ప్లాన్ వ‌ల్ల అసలు విష‌యం తెలుస్తుంది. దాంతో దేశానికి చెడు చేయాల‌నుకునే కేశ‌వ ఆలోచ‌న‌కి బ్రేక్ వేస్తాడు జై.
దాంతో జై, కేశ‌వ‌ల మ‌ధ్య మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ మైండ్ గేమ్ లో ఎవరు విజేతవుతారు..? మిసైల్‌ ను ఎలా జై కాపాడతాడు..? కేశవ వల్ల జై ఎలాంటి ఇబ్బందులు పడతాడు..? అనేది అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :
* తేజు – ప్రసన్న ల యాక్టింగ్
* మెహ్రాన్ గ్లామర్
* డైలాగ్స్
* సినిమాఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
* మ్యూజిక్
* కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ కి వస్తే :
* సాయి ధరమ్ తేజు , ప్ర‌స‌న్న‌ ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకూ అల్లరి అబ్బాయిగా , లవర్ పాత్రల్లో నటించిన సాయిధరమ్‌తేజ్‌ తొలిసారి ఓ బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించాడు. అతని లుక్‌, డైలాగ్‌ డెలివరీలో మార్పు కనిపించింది. దేశం కోసం చెప్పే డైలాగ్స్ లలో తేజు బాగా ఆకట్టుకున్నాడు.
* ఇక ప్రసన్న నటన సైతం చాలాబాగుంది. ఈ మూవీ తర్వాత ఇతడికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ‘ధ్రువ’ చిత్రం లో అరవిందస్వామి పాత్రను ఎలా గుర్తుంచుకున్నారో ఇందులో ప్రసన్న పాత్రను అలాగే గుర్తుంచుకుంటారు.
* హీరోయిన్ మెహ్రాన్ కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యింది. ఈమె నటించిన చివరి చిత్రాల్లో కన్నా ఇందులో చాల బొద్దుగా కనిపించింది. ఈమె పాత్ర పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా పెద్ద‌గా స్కోప్ లేదు. ఒక‌ట్రెండు స‌న్నివేశాలు మిన‌హా సాంగ్స్‌కే ప‌రిమితం అయ్యింది. గ్లామ‌ర్ ప‌రంగా మెహ‌రీన్ అందాల‌ను బాగానే అర‌బోసింది.
* ఇక నాగ‌బాబు, జ‌య‌ప్ర‌కాష్‌, ఈశ్వ‌రీరావు, సుబ్బ‌రాజు, కోట‌శ్రీనివాస‌రావు, స‌త్యం రాజేష్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగానికి వస్తే :
* మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో ఒకటి , రెండు పాటలు పర్వాలేదు అనిపించాయి. కానీ నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంది.
* సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ సినిమాకు ప్రాణం పోసాడని చెప్పాలి. ప్ర‌తి సీన్‌ను రిచ్ విజువ‌ల్‌లో తెర‌పై చూపించి సక్సెస్ అయ్యాడు.
* ఎడిటింగ్ విషయానికి వస్తే ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్ సినిమాను చాల ఫాస్ట్ గానే ముగించాడు కానీ అక్కడక్కడా ప్రేక్షకులను కాస్త గందరగోళానికి గురి చేసాడు.
* ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
* ఇక డైరెక్టర్ రవి విషయానికి వస్తే…దేశాన్ని కాపాడుకోవాల‌నుకునే ఓ యువకుడి లక్ష్యం గా కథ రాసుకున్నాడు..ఇలాంటి కథలు వచ్చినప్పటికి , ఇందులో మాత్రం విలన్ , హీరో మధ్య మైండ్ గేమ్ తో సాగే స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. కథలో రాసిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. దేశభక్తికి సంబంధించి తేజు చెప్పే డైలాగ్స్ ఆలోచించే విషంగా ఉన్నాయి.

చివరిగా :
జవాన్..ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే మైండ్ గేమ్ కథ..ఒకరు దేశ రక్షణ కోసం ఎత్తులు వేస్తే..మరొకరు దేశాన్ని నాశనం చేయడం కోసం వేసే ఎత్తులు..మరి ఈ ఎత్తుకుపైఎత్తుల మధ్య ఎలా జవాన్ కథ సాగింది అనేది మీరు తెర ఫై చూడాల్సిందే. ఈ కథ ను డైరెక్టర్ రవి ఎంతో అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. కాకపోతే కామెడీ పైనే పెద్దగా దృష్టి సారించలేకపోయాడు.
సింపుల్‌గా చెప్పాలంటే నేను, నా కుటుంబం, నా దేశం అనుకునే క‌థానాయ‌కుడి తేజు బాగా నటించాడు. ఇక దేశం కన్నా డబ్బే ముఖ్యం అనే రోల్ లో ప్రసన్న నటించడమే కాదు , చాల స్టైలిష్ గా కనిపించాడు. థమన్ నేపధ్య సంగీతం బాగుంది. గుహన్ సినిమా ఫోటోగ్రఫి సినిమా స్థాయి ని పెంచింది. హీరోయిన్ కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యింది. కాకపోతే యూత్ ఈమె గ్లామర్ ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఓవరాల్ గా వాంటెడ్ తో నిరాశ పరిచిన డైరెక్టర్ రవి , జవాన్ తో మాత్రం ఆ లోటును తీర్చేసాడు. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న తేజు కు సైతం ఈ జవాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఓవరాల్ గా జవాన్ – ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా.
రేటింగ్ : 3.25/5