మూవీ న్యూస్ మూవీ రివ్యూస్

రాజా ది గ్రేట్ రివ్యూ | Telugu Nandi

రవితేజ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా వచ్చేసింది. అదే రాజా ది గ్రేట్. పటాస్, సుప్రీమ్ వంటి సక్సెస్ లతో కమర్షియల్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా. టేస్ట్ ఉన్న దిల్ రాజు నిర్మించిన సినిమా. సాయి కార్తిక్ మ్యూజిక్ ఆల్బమ్ హిట్టయ్యింది. ట్రైలర్ కు సూపర్ టాక్ వచ్చింది. దీంతో రవితేజ రాజా ది గ్రేట్ సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇందులో విశేషమేమిటంటే… రవితేజ అంధుడిగా నటించడం. అంధుడిగా నటించినా ఎక్కడా కమర్షియాలిటీ మిస్ చేయలదన్నాడు దర్శకుడు. మరి దర్శకుడు చెప్పినట్టుగానే రవితేజతో ఎలాంటి పాత్ర చేయించాడు. ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేశాడో చూద్దాం.

 

కథేంటంటే

పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) కి కూతురు లక్కీ (మెహ్రీన్) అంటే ప్రాణం. అయితే దేవ తమ్ముడిని లక్కీ తండ్రి చంపేస్తాడు. దీంతో దేవ లక్కీ తండ్రిని చంపేస్తాడు. దీంతో లక్కీ పారిపోతుంది. తండ్రి స్నేహితుడు పోలీసాఫీసర్ చెంతకు చేరుతుంది. అతను ఓ పోలీస్ టీం ను పెట్టి లక్కీని కాపాడాలని డిసైడ్ అవుతాడు. మరో వైపు రాజా (రవితేజ) పుట్టి గుడ్డివాడు. కానిస్టేబుల్ తల్లి (రాధిక) మాత్రం రాజాకు అన్ని విషయాల్లోనూ మంచి ట్రైనింగ్ ఇస్తుంది. ఎలాగైనా పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తే చూడాలని ఆశపడుతుంది. దీనికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరికి ఎలాగోలా లక్కీని కాపాడే టీంలో కొడుకును చేర్పిస్తుంది. రాజా లక్కీని దేవా నుంచి ఎలా కాపాడాడు అన్నదే అసలు కథ.

ఈ సినిమాకు రెండు మేజర్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి రవితేజ అంధుడిగా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చూపించడం. అనిల్ రావిపూడి డైరెక్షన్. రవితేజ లాంటి స్టార్ హీరోను అంధుడిగా చూపించే సాహసం చేయడంతోనే సినిమా సగం సక్సెస్ సాధించినట్టే అనిపించింది. రవితేజ అంధుడిగా నటించేందుకు ఎంతగా హోం వర్క్ చేశాడో తెలీదు కానీ అంధులు ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా నటించి చూపించాడు. అలాగే తన మార్క్ డైలాగ్స్, కామెడీ ఫైట్స్ ని ఎక్కడా మిస్ కానివ్వలేదు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. హీరోయిజం కంటే కూడా రవితేజ పాత్రను హైలైట్ చేస్తూ కథ రాసుకోవడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. హీరోకు సినిమా మొత్తం కళ్లు కనిపించకపోయినా… ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయగలిగారు. లాజిక్స్ కంటే కూడా.. చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు కన్వే చేయగలిగాడు. నిజానికి ఇది ప్రయోగాత్మక కమర్షియల్ ఫార్మాట్ సినిమా. నిజంగా సాహసమనే చెప్పాలి. ఏమాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వచ్చేదే. అందుకే దర్శకుడు కథను పెద్ద గొప్పగా రాసుకోకపోయినా… ట్రీట్ మెంట్ విషయంలో, డైలాగ్స్ విషయంలో మేకింగ్ విషయంలో బాగా కేర్ తీసుకున్నాడు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రవితేజ ఎన్నో చేశాడు. తన కెరీర్లోనే ఎన్నో బెస్ట్ పాత్రలు కూడా చేశాడు. కానీ రాజా ది గ్రేట్ అతని కెరీర్ కే స్పెషల్ గా నిలుస్తుంది. ఎందుకంటే. తన పెర్ ఫార్మెన్స్ లోని మరో యాంగిల్ ను పరిచయం చేశాడు. నిజంగా కళ్లు లేని వాడిగా మన కళ్లకు అనిపించేంతగా నటించాడు. అలాగని ఎక్కడా ఎనర్జీ లెవల్స్ తగ్గనీయలేదు. ది బెస్ట్ పెర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని తన స్టైల్లో పెర్ ఫార్మ్ చేసి మంచి మార్కులు కొట్టేశాడు. మెహ్రీన్ కు మహానుభావుడు తర్వాత మరో మంచి సినిమా పడింది. లక్కీ పాత్ర తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర. నటించేందుకు స్కోప్ ఉన్న పాత్ర. ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసింది. దేవా పాత్ర పోషించిన విలన్ పాత్ర ధారికి కూడా చాలా మంచి పేరొస్తుంది. శ్రీనివాస రెడ్డి, పృథ్వీ, రాజేంద్ర ప్రసాద్. తనికెళ్ల భరణి, పోసాని మిగిలిన పాత్రల్లో నవ్వించారు. రాధిక, ప్రకాష్ రాజ్ కి మంచి పాత్రలు దక్కాయి.

టెక్నికల్ గా ఈ సినిమాకు ముందు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ కు మంచి పేరొస్తుంది. పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. రీ రికార్డింగ్ తో మరో లెవల్ కు తీసుకెళ్లాడు. మోహన కృష్ణ కెమెరా వర్క్ చాలా బాగుంది. డైలాగ్స్ దర్శకుడు అనిల్ అంట్ టీం చాలా బాగా రాసుకున్నారు. ముఖ్యంగా కామెడీ ట్రాక్స్ ని రక్తి కట్టించారు. ఎడిటింగ్ ద్వారా కొన్ని బోరింగ్ సీన్స్ ఎగరగొట్టేయ్యెచ్చు. ఫైట్స్ బాగా డిజైన్ చేశారు. దిల్ రాజు నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్న పాయింట్ ను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ… మ్యాగ్జిమమ్ సీన్స్ తో ఎంటర్ టైన్ చేశాడు. కథ చిన్నదే అయినా రవితేజ లాంటి స్టార్ హీరోను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నాడు. రవితేజ లో ని ఎనర్జీ లెవల్స్ ని కథకు యాప్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. ముఖ్యంగా కామెడీ పండేలా చాలా జాగ్రత్త పడ్డాడు. అంధుడి పాత్ర ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందేలా రాసుకున్న డైలాగ్స్ ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి. రవితేజ క్యారక్టర్ ద్వారా కాన్ఫిడెన్స్ ని మరో లెవల్లో చూపించాడు. మాస్ ఆడియెన్స్ ని ఎక్కువ సంతృప్తి పరిచేలా చాలా సీన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్, లవ్ సెంటిమెంట్ ని బలంగా చూపించి… ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు.

అయితే రొటీన్ కథ కావడం… క్లైమాక్స్ పార్ట్ లో సినిమా ఫినిష్ అయిందనుకున్నా… డ్రాగ్ చేయడం… ప్రథమార్థంలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు… విలన్ లోని బాడీని పవర్ ఫుల్ గా చూపించినా… బ్రిలియన్స్ ని చూపించలేకోపవడం మైనస్ గా మారాయి. సెకండాఫ్ లో లాజిక్స్ ని పక్కన పెట్టి ట్రైన్ ఎక్కడం లాంటి సీన్స్ కన్విన్సింగ్ గా లేవు.

రవితేజ ఎనర్జీ లెవల్స్ కు తగ్గట్టుగా అంధుడి పాత్ర ద్వారా చెప్పిన ట్రీట్ మెంట్ బేస్ డ్ కమర్షియల్ ఫార్మాట్ సక్సెస్ అయినట్టే. అనిల్ రావిపూడి డిజైన్ చేసిన పాత్రలు…. కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ పార్మెన్స్… ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. అనిల్ రావిపూడి తయారు చేసిన… రవితేజ నటించిన రాజా వరల్డ్ లోకి ఎంటర్ అయితే బాగా ఎంటర్ టైన్ అవ్వొచ్చు.

Final Verdict Reviews & Rating

కామెడీ తో ఎంటర్టైన్ చేసే Raviteja సినిమా.

TELUGUNANDI RATING : 3 / 5