రాజకీయం

అప్రమత్తంగా ఉండండి కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం

తెలుగునంది న్యూస్: పెథాయి తుఫాన్ కదలికలను అనుక్షణం అంచనా వేస్తూ దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు..
దేని ఫై అయన మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులు చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్ధేశం చేసాము. ముఖ్యంగా రెవిన్యూ, విద్యుత్, పంచాయితీ రాజ్, ఆర్ & బి శాఖలు సమన్వయంగా పనిచేయాలి. అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ శాఖలదే కీలక భూమిక. ఎస్‌డిఆర్‌‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సేవలే ప్రధానం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఆహార ప్యాకెట్లు అందజేయాలి. నిత్యావసర వస్తువులు పంపిణీకి సిద్ధం చేయాలి. బియ్యం, పప్పులు, వంటనూనె, బంగాళా దుంప, ఉల్లి సిద్దం చేసుకోవాలి. ప్రతి గ్రామంలో అందరినీ అప్రమత్తం చేయాలి. విపత్తు నిర్వహణలో పౌర బాధ్యత గుర్తుచేయాలి. సహాయ పునరావాస చర్యలు చేపట్టాలి. సహాయ చర్యలలో ప్రజల సహకారం తీసుకోవాలి. ప్రతి గ్రామానికి ఒక బృందాన్ని సిద్ధం చేసుకోవాలి. వరి కోతలు, పంట నూర్పిళ్లు ముందే పూర్తయ్యేలా చూడాలి. ధాన్యానికి నష్టం లేకుండా చూడాలి. ధాన్యం కొనుగోళ్లు రాత్రింబవళ్లు జరగాలి అన్ని అన్నారు.