రాజకీయం

ఎన్టీఆర్ గృహ ప్రవేశాల కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రకాశం జిల్లా యువనేత శ్రీకాంత్ కంచర్ల  

తెలుగునంది కందుకూరు: ప్రకాశం జిల్లా,  ఓగూరు గ్రామంలో ఎన్టీఆర్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మన ప్రకాశం జిల్లా యువనేత, జడ్ పిటిసి సభ్యులు  శ్రీకాంత్ కంచర్ల  గారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్నీ వర్గాలకు తెదేపా ప్రభుత్వం మేలు చేస్తుందని,రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం ఎన్నో ఆర్ధిక ఇబ్బందులో ఉన్నప్పటికీ నవ్యాంద్ర ప్రజానికానికి మెరుగైన జీవన వసతులు కల్పించాలని, అక్షర క్రమం లోనే కాకుండా అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని,అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను అన్ని రంగాలలో పెంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని,దేశ చరిత్ర లో ఏ రాష్ట్రము లోనూ లేని విధంగా రెండు విడతలుగా రాష్ట్రంలో దాదాపు 4 లక్షల ఇళ్ళ లో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించడం జరిగిందని, రాష్ట్రం లో మూడవ విడత లో కూడా దాదాపు 4లక్షల ఇళ్ళలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించిoదని,

కందుకూరు నియెాజకవర్గానికి NTR హోసింగ్ పథకం కింద 1056 గృహ నిర్మాణాలు, .గౌరవ ముఖ్య మంత్రి వర్యుల వారి దూరదృష్టి,అనుభవం వలన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని,భావితరాల భవిష్యత్ కోసం తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని, రాబోయే రోజుల్లో మనమంతా తెదేపాకు అండగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు & కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.