మూవీ న్యూస్ రాజకీయం

ఏ రాజకీయ నాయకుడి ప్రభావం మాపై లేదు.

మూడు నెలల పాటు ఓపికగా కూర్చుని సినిమాలన్నీ చూసి అవార్డ్‌ విజేతలను ఎంపిక చేశాం.

ఏ రాజకీయ నాయకుడి ప్రభావం మాపై లేదు. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా ఆలోచించాలి. నెగిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ తప్పులే కనిపిస్తాయి. అయినా అవార్డుల గురించి జనం చర్చించుకోవడం లేదు. కొంతమంది టీవీ లైవుల్లో కూర్చుని ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ పరువుని దిగజారుస్తున్నారు. అదే బాధగా ఉంది’. నంది అవార్డులపై జరుగుతున్న వివాదంపై నటి, దర్శకురాలు జీవిత స్పందించారు. 2015 సంవత్సరానికి జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆమె అవార్డులపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ‘రుద్రమదేవి’ చిత్రం కనీసం స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌కు కూడా నోచుకోలేదా అన్న విమర్శకు జీవిత సమాధానం ఇస్తూ ‘అక్కడ కూడా అంతే పోటీ ఉంది. అందుకే అన్ని కోణాల్లోనూ పరిశీలించి దీటైన సినిమానే ఎంపిక చేశాం. బాగున్న సినిమాను బాగోలేదని చెప్పడం మాకేమైనా సరదానా’ అన్నారు.

‘ జ్యూరీ ప్రాసెస్‌ ఎలా జరిగిందో.. తెలియకుండా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. సపోర్టింగ్‌ క్యారెక్టర్‌‌గా అల్లు అర్జున్‌ పేరుని ఎంట్రీకి పంపి ఉండవచ్చు. కానీ అదొక మంచి పాత్రకనుక ఎస్వీ రంగారావుగారి పేరుతో ఉన్న అవార్డ్‌ ఇచ్చాం. ఇదొక గొప్ప విషయమని మేం అనుకొంటున్నాం. ఈ విషయం గురించి అల్లు అరవింద్‌గారు, చిరంజీవిగారు, బన్నీ ఎవరూ మాట్లాడట్లేదు. బయటవాళ్లే మాట్లాడుతున్నారు’ అన్నారు జీవిత.