రాజకీయం

ఐరాస సదస్సులో చంద్రబాబుని చూసి కుమిలిపోతున్న బిజెపి & వైసిపి – జడ్పీటీసీ శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది కందుకూరు: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన టిడిపి తెలుగువారి అభ్యున్నతికి, అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తోందని రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్ మరియు కందుకూరు జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ కంచర్ల పేర్కొంటూ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకి పేరు వచ్చేస్తోందని బిజెపి కుమిలిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్య రాజ్య సమితిలో పర్యావరణం గురించి మాట్లాడ్డానికి ఆహ్వానం అందితే, దాన్ని కూడా వివాదం చేసేలా బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు మాట్లాడ్డం శోచనీయమన్నారు.
జీరో బడ్జెట్ తో ప్రకృతి సేద్యం గురించి చంద్రబాబు చేస్తున్న కృషికి ఆకర్షితులై ఐక్య రాజ్యసమితి పర్యావరణ విభాగం ఆధ్వర్యాన సుస్థిర వ్యవసాయం – అధిక సాయం- సవాళ్లు – అవకాశం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తూ అందులో మాట్లాడాలని సీఎం చంద్రబాబుకి ఆహ్వానం గౌరవంగా పంపితే దాన్ని కూడా వివాదం చేయడం దారుణమన్నారు.
అసలు బాబ్లీ వివాదాన్ని తెరమీదికి తెచ్చి అమెరికా వెళ్లకుండా అడ్డుకోవాలని చూసారని, అయినా కుదరక పోవడంతో సిగ్గులేకుండా వ్యాఖ్యానాలు చేస్తున్నారని శ్రీకాంత్ విమర్శించారు. ఎపి గొప్పతనాన్ని,తెలుగుజాతి వైభవాన్ని చాటిచెప్పేలా చంద్రబాబు ప్రసంగం చేస్తుంటే, బిజెపి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. వైసిపి వాళ్ళు కూడా దీనికి వంతపాడుతున్నారని శ్రీకాంత్ విమర్శించారు.

శ్రీకాంత్-కంచర్ల
శ్రీకాంత్-కంచర్ల