ఆరోగ్యం రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

ఒంటిమిట్ట ప్రకృతి బీభత్సం లో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగునంది ఒంటిమిట్ట: ఒంటిమిట్ట రాములోరి కల్యాణంలో ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు కుప్పకూలాయి. రేకులు ఎగిరిపోయాయి. ఈ ఘటనలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 52 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంటిమిట్ట నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. రాత్రి కడప రిమ్స్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించారు.

మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు. బాధితులందరినీ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, మెరుగైన చికిత్సలు అందేలా చూస్తామన్నారు. రాత్రి 11.45 గంటల వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు.

కాగా ఒంటిమిట్ట దుర్ఝటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, కడప జిల్లా అధికారులతో ఈ ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమయ్యారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్టలో శాశ్వత మండపం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.

 

Add Comment

Click here to post a comment