రాజకీయం లైఫ్ స్టైల్

కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలంటూ వ్యాఖ్యలు-ప్రకాశ్‌ రాజ్‌

తెలుగునంది : విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి బీజేపీపై విరుచుపడ్డారు.  బీజేపీ అధికారంలోకి వస్తే తన ప్రాణాలకు గ్యారెంటీ ఉండబోదన్న ప్రకాశ్‌ రాజ్‌. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలంటూ వ్యాఖ్యలు చేశారు. క‌ర్నాట‌క‌లో ‘బీజేపీ గనుక అధికారంలోకి వస్తే నన్ను ఏదో ఒకటి చేయటం మాత్రం ఖాయం. కలబురగిలో బీజేపీ నేతలు నాపై దాడికి యత్నించారు. నా కారుపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించారు. ప్రశ్నించటమే నా తప్పు అయితే ఇది ప్రజాస్వామిక దేశం ఎలా అవుతుంది?

 భారత్‌ను హిందూ దేశం అనటాన్ని తాను వ్యతిరేకిస్తాను. హిందువులు ఎక్కువగా ఉన్నారని వాళ్లు(హిందూ అతివాద సంస్థలు) భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తున్నారు. మరి దేశంలో నెమళ్ల సంఖ్య కన్నా కాకులు కోకోల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించటమే ఉత్తమం!. కేవలం ఒక మతం ఆధారంగా దేశానికి ముద్ర వేయటం మూర్ఖత్వమే అవుతుంద‌ని అన్నారు.