రాజకీయం

కిడారి కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

తెలుగునంది పాడేరు: విశాఖ జిల్లా మన్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పాడేరు చేరుకున్న ఆయన.. ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. కిడారి కుమారులిద్దర్నీచంద్రబాబు అక్కున చేర్చుకుని ఓదార్చారు. కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. కాసేపట్లో అరకు చేరుకోనున్న చంద్రబాబు.. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.

Did-MLA-Kidari-Plead-CM-To-Exempt-Him--1537858991-1756