రాజకీయం

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క రోడ్డైనా వేశారా?

తెలుగునంది న్యూస్: హైదరాబాద్ అంటే ప్రపంచంలోనే అందరికీ తెలుసని, అంతగా ఖ్యాతి రావడానికి చంద్రబాబు, కాంగ్రెస్‌లే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలుగుజాతి కోసం, హైదరాబాద్ కోసం చంద్రబాబు అద్భుతంగా పనిచేశారని రాహుల్ కితాబునిచ్చారు. రోడ్లు, నీళ్లు ఇలా అన్నీ చంద్రబాబు తెచ్చినవే అని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క రోడ్డైనా వేశారా? కనీసం గుంత పడితే తట్టెడు మట్టైనా పోశారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా సరే తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికే తమ మద్దతును ప్రకటించారని విమర్శించారు