రాజకీయం

క‌ర్ణాట‌క రిజ‌ల్ట్‌.. సీఎంచంద్ర‌ బాబు చెప్పిందే నిజ‌మ‌వుతోందిగా..

తెలుగునంది న్యూస్: దేశ‌వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్యానికి పెను ప్ర‌మాదంగా మారిన బీజేపీకి వ్య‌తిరేక‌గాలులు వీస్తున్నాయంటూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాలుగు రోజుల కిందట ఢిల్లీ వేదిక‌గా చేసిన కామెంట్ల‌ను అప్ప‌ట్లో ఆయ‌న ఏదో బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్నందున‌, ఏపీకి కేంద్రం సాయం అంద‌ని కార‌ణంగా చేస్తున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. నిజానికి బీజేపీ నేత‌లు కూడా ఇలాగే ప్ర‌చారం చేశారు. దేశ‌వ్యాప్త‌గా మాకే హ‌వా ఉంద‌ని, మాకు తిరుగులేద‌ని చెప్పుకొచ్చారు. కానీ, నాలుగు రోజులు తిరిగి క‌ర్ణాట‌క‌లో మూడు లోక్ స‌బ‌, రెండు శాస‌న స‌భ స్థానాల‌కు తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు తాజాగా విడుద‌ల‌య్యాయి. వీటిలో బీజేపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. మైనింగ్ రారాజు.. గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి ప‌ట్టుకొమ్మ వంటి బ‌ళ్లారి సీటులోనే బీజేపీ పూర్తిగా చ‌తికిల‌ప‌డింది.
ఇక్క‌డే మ‌రో విశేషం కూడా ఉంది. బళ్లారి లోక్‌సభ స్థానంలో 14 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం సాగించిన బీజేపీ… తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకుంది. అదేవిధంగా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి మిన‌హా అన్ని స్థానాల్లోనూ ప‌రాజ‌యం పాలైంది. ఈ ఫ‌లితాల అనంత‌రం సీఎంచంద్ర‌ బాబు రేటింగ్ అనూహ్యంగా పెరిగిపోయిం ది. దేశ‌వ్యాప్తంగా కూడా బీజేపీ ప‌రిస్థితి ఇలానే ఉంద‌న్న బాబు విశ్లేష‌ణ‌.. ముందు చూపున‌కు విమ‌ర్శ‌కులే క్లాప్ కొడుతున్నారు. జీఎస్టీ వంటి అలివిమాలిన ప‌న్నుల‌తో ప్ర‌జ‌ల న‌డ్డి విర‌గ్గొట్టిన ప్ర‌ధాని మోడీ.. నోట్ల ర‌ద్దు ద్వారా దేశం మొత్తాన్ని ఇప్ప‌టికీ ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక‌, పేద‌ల‌కు ఒక్క‌రూపాయి అప్పు ఇచ్చేందుకు వెనుకాడే బ్యాంకులు నీర‌వ్ మోడీ, విజ‌య్ మాల్యా వంటి వారికి వంద‌ల వేల కోట్లు అప్పులు ఇచ్చి.. దివాలా తీస్తుండ‌డానికి, అప్పులు తీసుకున్న వారు దేశం వ‌దిలి పారిపోవ‌డానికి కూడా మోడీనే కార‌ణమ‌న్న ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి తీవ్రంగా వెళ్లింది.

అదేస‌మ‌యంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌ను బీజేపీ చుల‌క‌న‌గా చూస్తోంద‌న్న ప్ర‌చారాన్ని కూడా ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. గుజ‌రాత్ కైతే ఒక న్యాయం. మిగిలిన ద‌క్షిణాది రాష్ట్రాల‌కు మ‌రో న్యాయం అనేలా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని కూడా ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌మ‌కు అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ రిజ‌ల్ట్ ఇలానే ఉంటుంద‌నే ఊహాగానాల‌కు ఇప్పుడు వెలుగు చూసిన క‌ర్ణాట‌క ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు అద్దం పడుతున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మొత్తంగా ఇక‌, ఏపీలో అయితే… బీజేపీ అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు ద‌క్క‌డం మాట అటుంచి వారి కుటుంబ స‌భ్యులే ఓటు వేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. సో.. మొత్తానికి బాబు వ్యూహం ఫ‌లించ‌డం, బీజేపీకి ప్ర‌జ‌లు గుండు కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.