రాజకీయం

చంద్రబాబు చొరవ ప్రకాశం జిల్లా కు ప్రగతి వెల్లువ – ప్రకాశం జిల్లా యువ నాయకులు శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది కందుకూరు : రామాయపట్నం పోర్టు మరియు పేపర్ పరిశ్రమ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞత తెలుపుతూ కందుకూరు CBN ARMY అధ్యర్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వాక్ లో  పాల్గొన్న ప్రకాశం జిల్లా యువ నాయకులు శ్రీకాంత్ కంచర్ల…

శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, ప్రకాశం జిల్లాకు తలమానికం వంటి కీలక పరిశ్రమ జిల్లాలో ఏర్పాటు కానుంది. జిల్లాలోని గుడ్లూరు మండలం చేవూరులో రూ.27 వేల కోట్ల పెట్టుబడితో 18 వేల మందికి (ప్రత్యక్షంగా 6 వేలు, పరోక్షంగా 12 వేల మందికి) ఉపాధినిచ్చే ఏపీపీ కాగిత పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఇండోనేషియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు తమ ఉత్పత్తులను చేరవేస్తున్న ఏపీపీ సంస్థ మన దేశంలో ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పడం ఇదే తొలిసారి. ప్రకాశం జిల్లాలో ఆంధ్రా పేపర్‌ ఎక్సలెన్స్‌ పేరుతో ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్ ఏర్పాటవుతోంది. శంకుస్థాపన సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పరిశ్రమకు సంబంధించిన పరస్పర ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్నారు.

దీనికి మూడు కిలోమీటర్ల దూరంలోనే రావూరులో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టుకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కేంద్రం కాదనడంతో ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేర్చేందుకు చంద్రబాబు సంకల్పించగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తున్న ఈ నాన్‌-మేజర్‌ పోర్టుద్వారా 15 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఈ రెండు ప్రాజెక్టులతో ప్రకాశం జిల్లా ప్రగతి ముఖచిత్రం పూర్తిగా మారనుంది అన్ని శ్రీకాంత్ అన్నారు.