రాజకీయం

చంద్రబాబు మేనల్లుడు ఉదయ్‌కుమార్‌ మృతి

తెలుగునంది న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మేనల్లుడు ఉదయ్‌కుమార్‌ (43)మృతి చెందారు. కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్‌కుమార్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయమే ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌కుమార్‌. ఈరోజు సాయంత్రం ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని నారావారిపల్లెకు తరలించనున్నారు. రేపు ఉదయం నారావారిపల్లెలో ఉదయ్‌కుమార్‌ అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.