రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

చంద్రబాబు సామాన్యుడు కాదు-కేఈ కృష్ణమూర్తి

తెలుగునంది కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్యుడు కాదని, తాను అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతాడని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆవిశ్వాసం పెట్టిన గంటలో 46 పార్టీలు తమకు మద్దతు తెలిపాయని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రజలను కేంద్రం అవమానపరుస్తోందని, రాష్ట్రానికి ఏమివ్వాలనుకున్నారో మోదీ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చేది హోదానా, ప్యాకేజీనా అనేది స్పష్టం చేసి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఎంపీలను పిలిచి మోదీ ఎందుకు మాట్లాడటం లేదని కేఈ ప్రశ్నించారు.

ఇక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ దానిపై తమకు సమాచారం లేదని అన్నారు. కేసీఆర్ ఆహ్వానం పంపితే ఆలోచిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఈ కోరారు.

Add Comment

Click here to post a comment