రాజకీయం

జగన్‌, ఓవైసీకి మోదీయే దోస్తీ కుదిర్చారా?

తెలుగునంది న్యూస్: అమరావతి: జగన్‌కు ఓవైసీ ఎప్పుడు దోస్త్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్‌, ఓవైసీకి మోదీయే దోస్తీ కుదిర్చారా? అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్‌లో సోనియా చెప్పగానే కేసీఆర్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ తొలుత హోదాకు మద్దతిచ్చి తర్వాత మాటమార్చిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు.