రాజకీయం

జగన్‌ పాదయాత్ర ఫెయిలా.? సక్సెసా.?

తెలుగునంది న్యూస్:

వైసీపీ అధినేత జగన్‌.. ఓ కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. మూడు వేలకుపైగా కిలోమీటర్లు నడిచి సంచలనం సృష్టించారు.. ఇంతవరకు ఓకే.. ఇది ఓ రికార్డే.. కానీ, ఆయన పాదయాత్ర ఫెయిలా.? సక్సెసా.? అనేది ఇప్పుడే చెప్పలేం.. ఎందుకంటే, పాదయాత్ర వెనుక ఉన్న అసలు లక్ష్యం.. అధికారం. అయితే, ఆయనకు నిజంగా అధికారం దక్కుతుందా..? లేదా..? అనే మాట పక్కనపెడితే తమ అధినేత పాదయాత్రపై నేతలు ఏం అనుకుంటున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారుతోంది..

జగన్‌ పాదయాత్రపై పార్టీ వర్గాలలో అత్యధికులు నెగిటివ్‌గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పాదయాత్ర చేస్తే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగాలి.. కానీ, చంద్రబాబు సర్కార్‌పై అలాంటి సూచనలు ఏవీ కనిపించడం లేదని వైసీపీ నేతలు సైతం కొందరు అంగీకరిస్తున్న మాట వాస్తవం.. అభివృద్ది, సంక్షేమ పథకాల మేళవింపుతో చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో, జగన్‌ ఆశించిన వ్యతిరేకత రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, వైసీపీ అధినేత తన ప్రసంగాలలో కేవలం చంద్రబాబునే టార్గెట్‌ చేశారు. ఏ రోజూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై ఆయన పోరాడింది లేదు.. దానికి కూడా చంద్రబాబునే ఎంచుకోవడం ఎంతవరకు సబబనే ప్రశ్న ఉదయిస్తోంది.. ఇటు, జగన్‌ తన పాదయాత్రతో నిజంగా అంతటి ప్రజా వ్యతిరేక మూడ్‌ని తెచ్చుకొని ఉంటే… ఆయనపై పాజిటివ్‌ టాక్‌ పెరిగితే అనేక మంది నేతలు క్యూ కట్టాలి. అది కూడా జరగలేదు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర విఫలం అయిందని చెప్పడానికి ఇది చాలని కొందరు మేధావులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు, జగన్‌ తన పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ఆయన చేసిన అతి పెద్ద తప్పిదం.. జగన్‌ పాదయాత్ర డైలీ సీరియల్‌గా సాగడంతో ఆయనని కవర్‌ చేయడానికి మీడియా సైతం ఇంటరెస్ట్ చూపింలేదు. అదే జగన్‌ రాకపోయినా, తన ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపినట్లయితే మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యేది. కానీ, అసెంబ్లీలో విపక్షం, స్వపక్షంలా మారి మైలేజ్‌ అంతా టీడీపీనే దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది.. పాదయాత్రలో జనసేన అధినేత పవన్‌పై అయినా.. ఒకటీ రెండు రోజులు విమర్శలు గుప్పించిన జగన్‌… మోదీని ఒక్కమాట అనకపోవడం విశేషం.. ఇన్ని నెగిటివ్‌లతో సాగిన జగన్‌ పాదయాత్ర సక్సెస్‌ల కంటే ఫెయిల్యూర్స్‌నే మూటగట్టుకుందని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట

Add Comment

Click here to post a comment