రాజకీయం

జర్మనీ యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ఏఆర్సీ రొబోటిక్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ పోస్టర్ విడుదల

తెలుగునంది న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్(ఈసీఎం) ఏఆర్సీ రొబోటిక్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ పోస్టర్ ను ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డి గారూ సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఏఆర్సీ రొబోటిక్స్ సెల్.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి మరియు జర్మనీలో ఉన్నత విద్యావకాశాలను పొందడానికి ఉపయోగపడుతుందని ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి గారూ అన్నారు.
ఎపిఎస్‌ఎస్‌డిసి, జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 31 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్వాన్సుడ్ రొబోటిక్స్ కంట్రోల్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రొబోటిక్స్ విభాగంలో 3వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఏఆర్సీ సీవోవో డాక్టర్ ఓంశ్రీ, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ శ్రీకాంత్ కంచర్ల, అన్నమాచార్య విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ రెడ్డి , సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ ఆనంద్, శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ సతీష్ రెడ్డి మరియు ఇతర ఇంజనీరింగ్ కాలేజీల చైర్మన్లు కూడా పాల్గొన్నారు.