రాజకీయం

టిడిపీనీ వీడి వైసీపీ లోకి వెళ్ళనున్న జయసుధ..!

తెలుగునంది న్యూస్: టిడిపీ నీ వీడి వైసీపీ లోకి వెళ్ళనున్న జయసుధ.. ఈరోజు సాయంత్రం జగన్ సమక్షంలో  వైసీపీ లోకి చేరే అవకాశం.  ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఏపీలో పార్టీ మారే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలో టికెట్ రాకపోవచ్చని కొందరు… మరో పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తామని మరికొందరు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ హీరోయిన్, మాజీ ఎమ్మెల్యే జయసుధ కూడా పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది.