రాజకీయం

టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేత ఉగ్ర నరసింహరెడ్డి

తెలుగునంది ప్రకాశం జిల్లా న్యూస్:   శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ కార్యక్రమానికి కనిగిరి నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. ‘‘కనిగిరి బాగా వెనుకబడిన ప్రాంతం. ఒకప్పుడు ఇక్కడ బాగా వలసలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి వలసలు ఉండవని హామీ ఇస్తున్నాను. వెలుగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నాం. వచ్చే వర్షాకాలంలోగా వెలుగొండ ద్వారా ప్రకాశం జిల్లాకు నీరిస్తాం. కనిగిరిలో ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరిస్తాను. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది. రాయపట్నం పోర్టుకు ఇప్పటికే భూమి పూజ చేశాం. జామాయిల్‌, సుబాబుల్‌ రైతులకు అదనంగా సాయం చేసే బాధ్యత నేను తీసుకొన్నాను. ప్రకాశం పంతులు పేరుతో యూనివర్శిటీకి శ్రీకారం చుట్టాం. కనిగిరిలో ఐఐఐటీ, వెటర్నీ కాలేజీని కేటాయించాం. కనిగిరిని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకొంటాను.’’

‘‘నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం చేకూరిందా..? జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. బ్యాంకులను మోసం చేసిన వ్యక్తులు విదేశాలకు వెళ్లారు. మనం మాత్రం అగ్రిగోల్డ్‌ నుంచి ప్రతి రూపాయి వసూలు చేస్తున్నాం. మోదీ పాలనలో అవినీతిపరులకు రాజవైభోగం అనుభవిస్తున్నారు. రూ. వెయ్యి నోట్ల రద్దు చేసి రూ.2,000 నోట్లను తీసుకొచ్చారు. ప్రజలు నోట్ల రద్దుతో అవస్థపడుతున్నారు.’’ అని పేర్కొన్నారు.అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ తాను చంద్రబాబునాయుడుకు అభిమానినని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కష్టపడుతున్న చంద్రబాబుకు అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఉగ్రసేన తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావు, పార్టీ నేతలు కరణం బలరాం, ఆలపాటి రాజా, దేవినేని అవినాష్‌ పాల్గొన్నారు.
అమరావతి : టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేత ఉగ్ర నరసింహరెడ్డి – ఉగ్ర నరసింహారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు .

ఉగ్రనరసింహారెడ్డి టీడీపీలోకి రావడం ఆనందం : కదిరి బాబూరావు

కనిగిరిలో మరోసారి టీడీపీ జెండా రెపరెపలాడాలి -కలిసి పని చేసి పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి – పరిస్థితులు అర్థం చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది : కదిరి బాబూరావు