రాజకీయం

తెలంగాణలో ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుంది – చంద్రబాబు

తెలుగునంది న్యూస్: దేశవ్యాప్తంగా బిజెపి బలహీనపడింది. గత 5ఏళ్లలో జరిగిన అనేక ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా, ఇప్పుడు తాజాగా జరిగిన 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి పూర్తిగా బలహీనపడింది.బిజెపి పాలన పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గత 5ఏళ్లలో బిజెపి చేసిందేమీ లేదనేది అన్నివర్గాల ప్రజలు గుర్తించారు. ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

బిజెపికి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు 5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదపడతాయి.తెలంగాణలో ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుంది.ముఖ్యమంత్రి కెసిఆర్ కు అభినందనలు. ఐదు రాష్ట్రాలలో గెలుపొందిన శాసన సభ్యులు అందరికీ అభినందనలు. అన్నిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.