రాజకీయం

త్వరలో టీడీపీలో చేరబోతున్న మరో కీల‌క నేత‌…!

తెలుగునంది కర్నూలు : తమ కుటుంబం త్వరలో టీడీపీలో చేరబోతోందని కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాన్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమ్మ కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని వెల్లడించారు. తాను మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. కోట్ల హర్ష వర్దన్‌రెడ్డికి తమకు వ్యక్తిగత విబేధాలు లేవని, రాజకీయ విబేధాలు మాత్రమే ఉన్నాయని కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు.