రాజకీయం వీడియోస్

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ZPTC సభ్యుడు శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది కందుకూరు: ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కందుకూరు లోని టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరం లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన  zptc సభ్యుడు శ్రీకాంత్. ఈ నిరసనలో  మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు…పాల్గొన్నారు

శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంత సంక్షోభం లో కూడా అయన నోటి వెంట వచ్చిన మాటలు, రోజుకు అరగంట నిరసన తెలియచేద్దాం, నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్రానికి నిరసన తెలియచేద్దాం, ఒక గంట ఎక్కువ పని చేద్దాం.

ఎప్పుడు చూసిన పని గురించే మాట్లాడతారు, ఎవరికోసం చేస్తున్నారు ఆ పని అని మనమందరం ఒక్క సారి ఆలోచన చెయ్యాలి. ఎంతో రాజకీయ అనుభవం , దేశం పై ప్రేమ , రాష్ట్రాన్ని అభివృద్ధి పదం పై నడిపించాలి అనే మొండి పట్టుదల , అన్ని ఆలోచించే మాట్లాడే ఏకైక రాజకీయ నాయకుడు  చంద్ర బాబు. ఎంత మంది ఎన్ని విధాలుగా హేళన చేసిన, అవమానం పాలు చేసిన అంతటి బాధను తన పంటి బిగువున తొక్కిపెట్టి , ఒక సంక్షోభం నుండి అవకాశాలు ఎలా అంది పుచ్చుకోవాలో తెలిసిన నాయకుడు.

రాష్ట్ర ప్రజలు ఆయనకు తోడుగా ఉంటే చాలు రాబోవు కాలం లో అది కూడా తొందరగానే అయన కట్టిన అమరావతి ని చూసి ఆయనే అబ్బురపడతారు, ఈ అమరావతి రాబోవు తరానికి , ప్రపంచానికే ఒక పాఠం కాబోతుంది.

ఇది తధ్యం! అన్ని శ్రీకాంత్ అన్నారు.

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన