రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

పార్లమెంటు మెట్లకు నమస్కరించి లోపలికి వెళ్ళిన చంద్రబాబు

తెలుగునంది ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పార్లమెంటుకు చేరుకున్నారు. ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు మెట్లకు నమస్కరించి లోపలికి వెళ్లారు.

అవిశ్వాసానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను కలిసి చంద్రబాబు గారు ధన్యవాదాలు తెలుపనున్నారు. అలాగే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కోరనున్నారు. విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అన్ని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు గారు ఇవ్వనున్నారు.

Andhra Pradesh Chief minister Chandrababu Naidu in new Delhi 

Add Comment

Click here to post a comment