రాజకీయం

పెళ్లి శుభలేఖపై దేవుడుగా బాలయ్య, ఓ వీరాభిమాని రచ్చ

తెలుగునంది న్యూస్: బెంగళూరు: తెలుగునాట నందమూరి బాలకృష్ణ అభిమానులు కొత్త ట్రెండ్‌కు నాంది పలికారు. కర్ణాటకకు చెందిన బాలకృష్ణ అభిమాని శ్రీనివాస్.. తన కుమారుడి శుభలేఖను వెరైటీగా రూపొందించాడు. బాలకృష్ణ శ్రీవేంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న ఫొటోను శుభలేఖపై ముంద్రించాడు. మే 13న జరగబోయే తన ఇంట పెళ్లికి బాలయ్యతో పాటు అభిమానులు రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇలాంటి సంస్కృతి ఎక్కువగా తమిళనాట కనిపిస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల సినీ హీరోలలో అయితే ఇదే తొలిసారి. బాలయ్య అభిమానుల కొత్త ట్రెండ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.