రాజకీయం లైఫ్ స్టైల్

బాబు టార్గెట్ గా జేడీ పొలిటికల్ ఎంట్రీ వెనుక రాయబారి ఇతనే… చూడండి.!

తెలుగునంది అమరావతి:  ఉత్తర భారత దేశంలో ఆడుతున్న రాజకీయ నాటకాలు బీజేపీ దక్షిణలో కూడా మొదలు పెట్టింది. అయితే ఉత్తరాన నమ్మినంత ఈజీగా మన రాష్ట్రాలు మోడిని నమ్మవు అందులో ఏమాత్రం సందేహం లేదు. దానికి అసలు కారణం కూడా మోడినే… 2014 ఎన్నికల్లో మోడి గ్రాప్ పీక్స్ లో ఉంది… అంతేకాదు మోడి దేశాన్ని మార్చేస్తాడు అని అనుకున్నారు అందరూ. కానీ, ఏం జరిగింది… మోడి కూడా సామాన్య అవినీతిని కూడా అరికట్టలేని నాయకుడు అని తెలిపోయింది. అయితే 2019లో మోడి గెలుస్తాడా లేదా అన్న దానిపై పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. కానీ, వినిపిస్తున్న సమాచారం వరకూ 2019 మోడికి ఒక పీడ కల అని చెప్పక తప్పదు మోడి ఫోకస్ ఇప్పుడు పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ పై ఉంది.

ఎలా అయినా ఆంధ్ర ను తన చేతుల్లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నాడు మోడి. ఎలా అయినా బాబుని పక్కకు తప్పించే ప్రయత్నం మొదలు పెట్టాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే… గతంలో తమకు మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు ను రాష్ట్రంలో అవినీతి పరుడిగా చిత్రీకరించాలని ఆయన మీద వ్యూహ రచన చేశారు మోడి అండ్ గ్యాంగ్. ఇక ఎవరి ద్వారా పావు కదపాలి అన్న ఆలోచనలో పాపం పెన్ డ్రైవ్స్ పుణ్యమా అని పవన్ దొరికేసాడు. బాద్ షా సినిమాలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఇప్పుడు ఒక నికార్సైన బకరా కావాలి అంటాడుగా ఎన్టీఆర్ అలా అన్న మాట పాపం చేసిన తప్పుల వల్ల పవన్ బీజేపీకి అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఇక్కడే బీజేపీ సరికొత్త రాజకీయం మొదలు పెట్టింది… మెల్లగా పవన్ ని రంగలోకి దింపి బాబుని టార్గెట్ చేసి చంద్రబాబు పై వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి గేమ్ మొదలు పెట్టారు ఇక ఈ గేమ్ కి మన డిల్లీ గ్యాంగ్ కి సహాయం చేసింది ఎవరో తెలుసా గవర్నర్‌ నరసింహన్‌ అట. చంద్రబాబుని కేసులలో ఇరికించి రాష్ట్రంలో టిడిపి పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి..ఆ స్థానంలో బీజేపీ పాగా వేయాలని చూస్తుందట.

ఆ గేమ్ లో భాగంగానే… రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మీద దృష్టి పెట్టి కాపు సామాజికవర్గానికి చెందిన సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణను సైతం తెరపైకి తీసుకువచ్చింది మోడి అండ్ గ్యాంగ్. ఇక లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుని పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించి త్వరలో కొత్త రాజకీయం చెయ్యనుంది బీజేపీ. మరి ఉత్తరాన ఉడికిన బీజేపీ పాచిపోయిన పోప్పులు… దక్షిణాన ఉడకవు అని పాపం తెలీదు. 2019లో తెలుగు ప్రజలు ఓట్లు అడిగితే బీజేపీని తరిమి తరిమి కొడతారు… దానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ఉదాహరణ. మరి పాపం బీజేపీ అదేమీ తెలియక పిట్ట రాజకీయాలు మొదలు పెట్టింది..!
తెలుగు వాయిస్

Add Comment

Click here to post a comment