రాజకీయం

బీజేపీ ఈడీతో సైడ్ బిజినెస్సా..? గాలి ఎక్కడికి పారిపోయాడు..?

తెలుగునంది న్యూస్: గనుల్ని దోచి వేల కోట్లు సంపాదించి.. ఇప్పుడు.. చివరికి.. కేసులు లేకుండా చేస్తానంటూ డబ్బులు వసూలు చేసే స్థితి దిగజారిపోయాడు. బళ్లారిలో బీజేపీని అక్కడి ప్రజలు… లాగి పెట్టారు. కొట్టింది బీజేపీనే అయినా.. కొట్టించుకుంది మాత్రం గాలి జనార్దన్ రెడ్డి అండ్ గ్యాంగే. ఈ దెబ్బ చురుకు మాయం అవక ముందే ఆయన పరారైపోయారు. గాలిని పట్టుకోడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. గాలి జనార్ధన్‌రెడ్డి తాజా చిక్కులకు కారణం ఆయన అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడమే. అంబిడెంట్‌ను ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారు. ఇందు కోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు.

ఈ కేసు నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి కోసం వేట కొనసాగుతోంది. గనుల సంపాదన ఆగిపోవడంతో.. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల సాయం…సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకుని సైడ్ బిజినెస్ ప్రారంభించారు. సీబీఐ, ఈడీ కేసులు ఉన్న వాళ్ల లిస్ట్ ను తీసుకుని వారిపై కేసులు లేకుండా చేసేందుకు బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకూ.. ఇలా ఎన్ని చేశారో.. కానీ.. అబిడెంట్ అనే కంపెనీ విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు.

ఈడీ, సీబీఐ… ఇప్పటి వరకూ.. రాజకీయ ప్రత్యర్థుల వేటకే.. కాదు.. ఇప్పుడు ఏకంగా బీజేపీ నేతలకు వ్యాపార సంస్థలుగా.. బ్లాక్ మెయిలింగ్‌ వ్యాపారానికి.. కేంద్రబిందులువుగా.. కేసులు, సెటిల్మెంట్ల కార్ఖానాగా మారిపోవడం… కలకలం రేపుతోంది. ఈ అంశంలో గాలి జనార్ధన్ రెడ్డి దొరికితే.. అసలు ఈడీలో దొంగలెవరో బయటపడే అవకాశం ఉంది. రాజ్యాంగ సంస్థలను.. ఈ విధంగా గాలి జనార్ధన్ రెడ్డి వాడుకోవడం… మోడీకి తెలియకుండా జరుగుతుందా..? ఆయనకే కదా ప్రొత్సహించింది. వాటాలు కూడా.. బీజేపీ దాకా వెళ్లాయన్న రుజువులు కూడా… పోలీసులకు చిక్కే అవకాశం ఉంది.