రాజకీయం

మంగళవారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు

తెలుగునంది న్యూస్: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు మంగళవారం (మే 14,2019) ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌ కానున్నాయి. ఫ‌లితాల‌ను విద్యార్థులు ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌, పీపుల్‌ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్‌ లలో చూసుకోవచ్చు.

ఇకపోతే ఇంటికి ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఉంటే… టీవీ తెరపై కూడా ఫలితాలు చూసుకోవచ్చు. టీవీ తెర‌పై విద్యార్థి నెంబ‌రు టైపు చేయ‌గానే.. ఫ‌లితాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు ఏర్పాట్లు చేశారు.