రాజకీయం

మరికాసేపట్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగునంది శ్రీకాకుళం : తితలీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఏరియల్‌ సర్వే చేయనున్నారు. సోంపేట, కవిటి, పలాస మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. 
 
మరోవైపు తితలీ తుఫాను బీభత్సానికి ఉత్తరాంధ్ర వణికిపోయింది. శ్రీకాకుళంలోని పలాస సమీపంలోని డోకులపాడు-మెట్టూరు పరిసరాల్లో గురువారం తెల్లవారుజామున ‘తితలీ’ తీరం దాటింది. ఈ తుఫాను ఒడిసాలోని గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటుతుందని, ఆ ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీవ్ర గాలులతోకూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
 
దీనికి భిన్నంగా ‘తితలీ’ పలాస వైపు చొచ్చుకురావడంతో శ్రీకాకుళం, విజయనగరం తీరాలు తీవ్ర కల్లోలానికి గురయ్యాయి. ఈ కల్లోలంలో చిక్కుబడి పదిమంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. విశాఖ తీరంలో మరో ముగ్గురు గల్లంతయ్యారు. తితలీ తుఫానుపై సీఎం చంద్రబాబు ఎప్పకప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండలని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
తితలీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు