రాజకీయం

మహాకూటమి ద్వారానే తెలంగాణ అభివృద్ధి , ప్రజా సంక్షేమం: శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది తెలంగాణ: మహాకూటమి ద్వారానే తెలంగాణ అభివృద్ధి , ప్రజా సంక్షేమం: శ్రీకాంత్ కంచర్ల, చైర్మన్ జిల్లా ప్రజాపరిషత్ సభ్యుల సంఘం, ప్రకాశం జిల్లా .

కుకట్ పల్లి అసెంబ్లీ ఎన్నికల మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని గారికి మద్దతుగా ప్రకాష్ నగర్ ప్రచారంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా యువనాయకులు శ్రీకాంత్ గారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేసింది, పార్టీ బలహీన వర్గాల పక్షపాతి అని కార్మిక వర్గాలందరు సుహాసిని గారికి మద్దతుగా నిలబడి గెలిపించాలని శ్రీకాంత్ అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసం చేసిన కేసీఆర్ కు , నందమూరి సుహాసిని గెలుపుతో బుద్ధి చెప్పాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, స్థానిక తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.