ఆరోగ్యం రాజకీయం లైఫ్ స్టైల్

మాణిక్యాలరావు వ్యాఖ్యలపై విరుచుకుపడిన మంత్రి దేవినేని

తెలుగునంది  అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ వర్సెస్ బీజేపీగా వాతావరణం మారింది. ఇవాళ్టి చర్చలో రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపణలపై నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. పట్టిసీమపై వైసీపీ నేత బుగ్గన రాజేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలనే విష్ణుకుమార్ రాజు చేస్తున్నారని విమర్శించారు.

ఏడాదిలోగా పూర్తి చేసేపనిని.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐదున్నర నెలల కాలంలోనే పూర్తి చేశామన్నారు. గోదావరి జలాలు.. ప్రకాశం బ్యారేజీకి తెచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. వైసీపీ అధినేత జగన్, బుగ్గన మాటల్నే బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు. “ఇన్నేళ్లు కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా..? ఏమి డ్రామాలు మొదలు పెట్టారు?” అంటూ తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై దేవినేని ఫైర్ అయ్యారు. మాణిక్యాలరావు వ్యాఖ్యలపై విరుచుకుపడిన మంత్రి దేవినేని..అప్పట్లో మంత్రిగా ఉన్న మీరు ఎందుకు అడగలేదని నిలదీశారు. అప్పుడు నోరు లేదా ఆగ్రహం వ్యక్తం చేశారు