రాజకీయం

ముఖ్యమంత్రి యువనేస్తం పధకాన్ని సద్వినియోగం చేసుకోండి – రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్ శ్రీకాంత్ కంచర్ల

తెలుగునంది న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పధకం మంగళవారం ఆర్భాటంగా ప్రారంభం కానుంది. ఈ పధకం కింద అర్హులైన నిరుద్యోగులకు నెలవారీ వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పధకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ పధకానికి శ్రీకారం చుట్టారు. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా నిరుద్యోగులు నమోదు కావడంతో దేశంలోనే ఇదొక రికార్డుగా చెబుతున్నారు.

ఐతే ముఖ్యమంత్రి యువనేస్తం పధకం దేశంలోనే ఆదర్శవంతమైన,సాహసోపేతమైన నిర్ణయమని రాష్ట్ర సేవామిత్ర నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్ మరియు కందుకూరు జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ కంచర్ల గారు అన్నారు

శ్రీకాంత్ మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఈ పధకం వర్తిస్తుందని, ప్రజాసాధికార సర్వే లో నమోదు చేసుకోనివారికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది అలాగే నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే 1100 కి కాల్ చేస్తే సత్వరమే పరిష్కారం కాబడుతుందని తెలిపారు…నిరుద్యోగ భృతితో పాటు ఉపాది,ఉద్యోగ అవకాశాలు కల్పించటమే ఈ పధకం,ముఖ్యమంత్రి గారి ధ్యేయమని శ్రీకాంత్ అన్నారు…

ముఖ్యమంత్రి యువనేస్తం కందుకూరు