రాజకీయం

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పోరాడండి రా అంటే, వెళ్లి ప్రధాని కార్యాలయంలో కూర్చుంటాడు ఒకడు… ఇంకొకడు, నేను నిజాయతీ పరుడుని అని కటింగ్ ఇస్తూ, మోడీ అంటే ఇష్టం అంటాడు

తెలుగునంది ఢిల్లీ: రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పోరాడండి రా అంటే, వెళ్లి ప్రధాని కార్యాలయంలో కూర్చుంటాడు ఒకడు… ఇంకొకడు, నేను నిజాయతీ పరుడుని అని కటింగ్ ఇస్తూ, మోడీ అంటే ఇష్టం అంటాడు, ప్రేమ అంటాడు.. వీరిద్దరూ కలిసి, ఇక్కడ మోడీ పై పోరాడుతున్న చంద్రబాబుని తిడతారు.. మోడీని ఒక్క మాట అనాలంటే భయం… రాష్ట్రం కోసం, మోడీతో పోరాడాలి అంటే భాయం… ఢిల్లీలో మోడీ చుట్టూ తిరుగుతారు, ఇక్కడకు వచ్చి పోరాడుతున్నట్టు బిల్డ్ అప్ ఇస్తారు… తెలుగు చానల్స్ లో రెచ్చిపోతారు, నేషనల్ మీడియాలో మోడీ అంటే ఎంతో ఇష్టం అంటారు… అయితే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి, మోడీని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు అంటున్నారు…విజయసాయి రెడ్డి, ప్రతి రోజు ప్రధాని మంత్రి కార్యాలయంలో కనిపిస్తూ ఉంటారు… ఎందుకో ఎవరికీ తెలియదు… ఈయన ప్రొఫైల్ ఏమన్నా మంచిదా అంటే, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A2.. ఇలాంటి వాడికి ప్రతి రోజు ప్రధాని కార్యాలయంలో ఏమి పని ?

          మోడీ పై అవిశ్వాసం పెడతాం అంటూ, వెళ్లి మోడీ ఆఫీస్ లోనే కూర్చుంటారు… ఇదే విషయం చంద్రబాబు పదే పదే అడుగుతున్నారు.. ప్రధాని కార్యాలయం, ఏమన్నా ఆర్ధిక నేరస్థుల అడ్డా నా అంటూ, ప్రశ్నించారు…అయితే, మొన్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు మాటల పై స్పందిస్తూ, నేను రోజు వెళ్లి ప్రధానిని కలుస్తా, నా ఇష్టం అంటూ రెచ్చిపోయారు… దానికి చంద్రబాబు మాట్లాడుతూ, మీరు వెళ్లి కాపురాలు చేసుకోండి, నేను అడిగేది ప్రధాని కార్యాలయం, ఇలాంటి నేరస్థులని ప్రోత్సహిస్తుందా అంటూ ప్రశ్నించారు… దీని పై విజయసాయి రెడ్డి ఈ రోజు స్పందిస్తూ, మోడీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న చంద్రబాబు పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని చెప్పాడు… ప్రధాని కార్యాలయాన్ని కించపరుస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానన్నారు…. ఇక్కడ వింత ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుడు చంద్రబాబు మాటలకు అభ్యంతరం చెప్పలేదు.. కాని, వైసిపీకి చెందిన విజయసాయి మాత్రం, మోడీని అంటే, నేను ఊరుకోను అంటూ నోటీసు ఇస్తాను అంటున్నాడు.. అలాగే, రాష్ట్రానికి చేసిన అన్యాయం పై ప్రధానితో మాట్లాడు అంటే మాత్రం, పరార్… ఇంట ఓపెన్ గా కుమ్మక్కు అయిపోయి, రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్న వీరికి, ప్రజలే బుద్ధి చెప్పాలి.