రాజకీయం

రేవంత్ రెడ్డి విడుదల..! – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్

తెలుగునంది న్యూస్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి భారీ భద్రత మధ్య ఆయనను కొడంగల్ కు తరలించారు. మరోవైపు కొడంగల్ లోని రేవంత్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. కేసీఆర్ సభ నేపథ్యంలో, ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి, జడ్చర్లకు తరలించారు. రేవంత్ ను విడుదల చేయాలని కాసేపటి క్రితమే డీజీపీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించారు.