రాజకీయం లైఫ్ స్టైల్

వచ్చే వారం రోజులు దేశ రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయా? ఏప్రిల్ 20న చంద్రబాబు చేసే దీక్ష రాజకీయం గా సంచలనానికి వేదికగా అవుతుందా?

తెలుగునంది అమరావతి: ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా సమయాల్లో అభివృద్ధి మాత్రమే ముఖ్యం అని పదే పదే చెప్పే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ ఎత్తుల్లో వేగం పెంచారు. ఏప్రిల్ 20 న చంద్రబాబు 68వ పుట్టినరోజు నాడు జరిగే దీక్ష జాతీయ రాజకీయాలపై చంద్రబాబు పట్టు చూపించటానికి వేదికగా చూపించే ఆలోచనలో ఉన్నారా?జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా కాకపోయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరోసారి కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉన్నారా? ఇలాంటి కారణాల వాళ్ళ ఏప్రిల్ 20న చేసే దీక్ష రాజకీయంగా సంచలనానికి వేదికగా మారింది అంటుంది జాతీయా మీడియా.

ఇటీవల చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు మీద ఫోకస్ పెంచిన జాతీయ మీడియా చంద్రబాబు ని చాలా సునిశితం గా ఫాలో అవుతుంది.ఆయన ప్రతి కదలికను విశ్లేషిస్తుంది.ఆఖరికి ఆయన సింగపూర్ పర్యటనకి కూడా విశేషం అయిన కవరేజ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని తొలుత మంత్రులను ఉపసంహరించుకున్న చంద్రబాబు అనంతరం ఎన్డియే నుంచి కూడా బయటకు వచ్చారు. ఆ వెంటనే అవిశ్వాసం ప్రకటించడంతో బిజెపి నేతల్లో ఒక్కసారిగా కలవడం మొదలయింది. దీనితో అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి బిజెపి ఆడిన డ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసిన పోరాటం అసమానం అనే చెప్పుకోవాలి. పార్లమెంట్ లో ప్రధాని కుర్చీ నుంచి ప్రధాని ఇంటి వరకు పోరాటం చేసి జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యారు.ఈ తరుణంలో ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు మోడిని మీడియా ముందు ఎండగట్టారు. జాతీయ మీడియాతో చంద్రబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఒక్కసారిగా బిజెపిని షాక్ కి గురి చేసింది. ఇక అప్పటితో చంద్రబాబు భయస్తుడు అనే వారు ఆశ్చర్యపోవడమే కాక చంద్రబాబుని ఎలా విమర్శించాలో కూడా అర్ధం కాక ఆత్మరక్షణలో పడిపోయారు. జగన్ ని కూడా ఇబ్బందుల్లోకి నేట్టేయడమే కాక ఫోకస్ అంతా తెలుగుదేశం వైపుకి తిప్పుకున్నారు.అయితే పార్లమెంట్ సమావేశాలను విపక్షాలుసరిగా జరుగనివ్వలేదని మోడీ చేసిన ఒక రోజు దీక్షపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మోడీ దీక్ష పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఎండగట్టారు. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈ నెల 20న తన పుట్టినరోజు సందర్బంగా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకి వ్యతిరేకంగా దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తే మాత్రం అది రాజకీయంగా బిజెపిని జాతీయ స్థాయిలో దెబ్బ కొట్టే అవకాశం ఉండటమే కాక మోడీ వ్యతిరేక శక్తులకు బలం చేకూరే అవకాశం ఉందని అభిప్రాయ పడుతుంది జాతీయ మీడియా. అయితే ఈ దీక్షకి మద్దతుగా దాదాపు ఎనిమిది మంది ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు, నేతలు చంద్రబాబు ని కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ దీక్ష ని కొత్తగా ఫార్మ్ అవుతున్న మూడవ ఫ్రంట్ కి తొలి అడుగుగా చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినప్పుడు వినని బిజెపికి రాజకీయం చూపించాలి అని తెలుగు దేశం అధ్యక్షుడి అభిప్రాయం అని నేషనల్ మీడియా చెప్తుంది.అయితే చంద్రబాబు ఇంకా విషయం మీద ఆయన అభిప్రాయం చెప్పకపోయినా, ఆయన నిర్ణయం ఏంటో ఈ పాటికే తెలిసిపోయినట్టే అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా వచ్చే వారం రోజులు దేశ రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి అనటం లో ఎటువంటి సందేహం లేదు.