రాజకీయం

వైసీపీ నేతల ఫై తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డ మంత్రి దేవినేని ఉమా

తెలుగునంది విజయవాడ:మంత్రి దేవినేని ఉమా ను విమర్శించే అర్హత వైసీపీ నేతలు పార్థసారథి వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కడిదని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు జంపాల సీతారామయ్య అన్నారు. మంత్రి దేవినేని ఉమపై మాజీ మంత్రి కొలుసు పార్థసారధి వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన సోమవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పార్థసారధి పని చేసినప్పుడు జిల్లాలో ఇసుక క్వారీల్లో కమిషన్లు కాంట్రాక్టు పనులు బినామీలు పేరుమీద చేసి కమీషన్ల దోచుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధి కంటే కూడా తన అభివృద్ధి ఎజెండాగా పనిచేయటం ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గత నాలుగు సంవత్సరాలుగా మంత్రిగా జిల్లా కి ఎనలేని అభివృద్ధి చేశారని అన్నారు. అభివృద్ధిలో మంత్రిగా దేవినేని ఉమా పని చేసాడో పార్థసారధి పని చేసాడో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 13 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చి పదివేల కోట్ల పంటను కాపాడి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆనాడు వైఎస్ కమిషన్ కుదరక పక్కన పెట్టేసిన సంగతి వాస్తవం కాదా ఆన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వైసీపీకి పుట్టగతులు ఉండవని భయంతో అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పట్టిసీమ పోలవరం పై విమర్శలు చేస్తే ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

8886_jagan-devineni