ఆరోగ్యం రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

శ్రద్ధతో చదవి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – శ్రీకాంత్

తెలుగునంది కందుకూరు: ఈ రోజు గుడ్లూరు మండలంలోని  MPP  స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న zptc సభ్యుడు  శ్రీకాంత్ కంచర్ల. శ్రీకాంత్ మాట్లాడతూ  ప్రభుత్వం కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని శ్రీకాంత్  అన్నారు.  సీఎం చంద్రబాబు గారు  కృషితో ప్రతి మండలానికి ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయడంతో పేదలకు సైతం ఉన్నత విద్య అందుతుందన్నారు. అందుకు తగ్గట్లు విద్యార్థులు శ్రద్ధతో చదవి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.