రాజకీయం

శ్రీకాంత్ కంచర్ల, ప్రకాశంజిల్లాలో ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్, కొత్త ఉత్సాహం…యువ కెరటం

తెలుగునంది న్యూస్ : జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ డిఫ‌రెంట్ స్టైల్ క్రియేట్ చేసుకుని న‌వ‌యువ శ‌కాన్ని స్టార్ట్ చేశారు. అటు ప్రకాశం జిల్లా యూత్ వింగ్‌లో శ్రీకాంత్ మంచి ఫాలోయింగ్ ఏర్ప‌రుచుకున్నారు. ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు…. ముఖ్యంగా యువ‌త‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఎలాంటి టైంలో అయినా స్పందించి వెంట‌నే ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతాడ‌న్న పేరు శ్రీకాంత్ కంచర్ల కు అటు పార్టీ లో నియోజకవర్గం లో ఉంది. దీంతో శ్రీకాంత్ కు యువ‌త‌లో తిరుగులేని క్రేజ్ సొంత‌మైంది. మన గౌరవ ముఖ్య మంత్రి ప్రేవేశ పెట్టిన ప్రతి ఒక్క ప‌థ‌కాల ను…ప్రజలకి వివరిస్తూ..పార్టీ బలోపేతానికి కృషి చేస్తున వ్యక్తి శ్రీకాంత్ కంచర్ల.

కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పోతుల రామారావు తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల్లో పార్టీ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు… ఇంకా చెప్పాలంటే ఎప్ప‌టి నుంచో పార్టీనే న‌మ్ముకుని ఉన్న సామాన్య కార్య‌క‌ర్త‌కు కూడా అందేలా త‌న వంతుగా కృషి చేస్తున్నారు.

ఈ విష‌యంలో శ్రీకాంత్ కంచర్ల , ఎమ్మెల్యే పోతుల రామారావు స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళుతూ కందుకూరు అభివృద్ధిని కొంత పుంత‌లు తొక్కిస్తున్నారు.