రాజకీయం

BIG NEWS : 2019 తెలంగాణ‌లో అధికారం వీరిదే, స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు

BIG NEWS : తెలుగునంది న్యూస్: ఐదు సంవ‌త్స‌రాలు పాలించే అవ‌కాశం ఉన్నా, కేసీఆర్ ఎందుకు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్న‌ట్లు అన్న అనుమానాలు అప్ప‌ట్లో అందరిలోనూ వ్య‌క్త‌మ‌య్యాయి. కేసీఆర్ ఎదో బ‌ల‌మైన కార‌ణం లేనిది అధికారాన్ని వ‌దులుకొని, మ‌ళ్లీ అదే అధికారం కోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఎందుకు వెళ్తాడు అన్న అంశం పై అనేక ర‌కాల చ‌ర్చ‌లు, వాదోప‌వాదాలు జ‌రిగినా…ప్ర‌తిప‌క్షాల‌ను నామ‌రూపాలు లేకుండా చేసి, మ‌ళ్లీ గెలుస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్న వాద‌న బ‌లంగా తెర‌పైకి వ‌చ్చింది. పైగా స‌ర్వేల‌న్నీ ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టంతో కేసీఆర్ ఆల‌స్యం చేయ‌కుండా అసెంబ్లీని ర‌ద్దుచేసి, ప్ర‌జ‌ల ముందుకొచ్చాడు.

కానీ… అప్పుడ‌నుకున్న‌ట్లు ఇప్పుడు విప‌క్షాలు చెల్లాచెదురుగా లేవు. అన్నీ ఒక్క‌ట‌య్యాయి. కాంగ్రెస్-టీడీపీ క‌లిసి పోటీచేస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. అస‌లు అది ఊహ‌కంద‌నిది. వీటికి తోడు తెలంగాణ ఐకాన్ కోదండ‌రాం టీజెఎస్, తెలంగాణ‌కు మ‌ద్దితిచ్చిన సిపిఐ కూడా మ‌హ‌కూట‌మికి జై కొట్ట‌డంతో… ప‌రిస్థితి మారిపోయింది. పైకీ మీడియా పెద్ద‌గా చూపించ‌క‌పోయినా, గ్రౌండ్ లో రియాల్టీ మారుతుంద‌న్న‌ది స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. మ‌హకూట‌మి ఏర్ప‌డ్డ త‌ర్వాత ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన ఓ సంస్థ చేసిన స‌ర్వే… విస్తుపోయే నిజాలను బ‌య‌ట‌పెట్టింది. ఈ సంస్థ‌కు అత్యంత న‌మ్మ‌క‌మైన స‌ర్వేగా పేరుండ‌టం విశేషం. ఉత్త‌రాదికి చెందిన డీవోటర్స్ టుడే అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అధికారం చెలాయించిన టీఆర్ఎస్ పార్టీకి కేవ‌లం 30 నుండి 35 మాత్ర‌మే వ‌స్తాయ‌ని తేలింది. అందులోనూ 22 స్థానాలు ప‌క్క గా గెలిచి తీరుతుంద‌ని, మిగిలిన వాటిలో ఎక్కువ‌గా విజ‌యావ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. మ‌రోవైపు మ‌హ‌కూట‌మికి మాత్రం అత్యంత బూస్ట్ ఇచ్చేలా… భారీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపింది.

మ‌హ‌కూట‌మి మొత్తం 75 – 78 స్థానాల‌కు పైగా కైవ‌సం చేసుకొని, అధికారం చేప‌డుతంద‌ని స‌ర్వే తేల్చింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ప్ర‌స్తుతం ఉన్న 5 సీట్ల‌లో 3 సీట్లు కోల్పోయి కేవ‌లం 2 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. గ‌తంలోలాగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సెంటిమెంట్ ఇక ప‌నిచేయ‌ద‌ని, అందుకే టీఆర్ఎస్ కు కాలం చేల్లింద‌ని కూడా తేల్చింది. ప్ర‌జ‌లు అభివృద్దిని కోరుకుంటున్నార‌ని, కేవ‌లం మాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే పార్టీల‌ను కాదంటున్న‌ట్లు డీ-వోట‌ర్ స‌ర్వేలో వెల్లడయ్యింది.

Telangana-Elections-2019-Opinion-Polls-TRS-Congress-TDP-Others