రాజకీయం

Breaking News | ఆంధ్రప్రదేశ్ లో రూ. 60 వేల కోట్లతో 29 లక్షల కుటుంబాలకు ఇళ్లు – సీఎం చంద్రబాబు

తెలుగునంది న్యూస్: పట్టణాలు, గ్రామాల్లో రూ. 60వేల కోట్లతో 29లక్షల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పట్టణ గృహ నిర్మాణంపై రాష్ట్ర సీఎస్ అనిల్‌ చంద్ర పునేఠ, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఈ రోజు సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

‘‘ఇల్లు కట్టించాలంటే చాలా కష్టం.. మా నాన్న పడిన కష్టం కళ్లారా చూశా. అందుకే ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తున్నాం. గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరగాలి. త్వరలోనే పట్టణాల్లో లక్ష గృహాల సామూహిక ప్రవేశాలు జరగనున్నాయి. అనుకున్న సమయానికి నిర్దేశించిన లక్ష్యం చేరాలి. బిల్లుల చెల్లింపులో వేగం పెంచి, మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని అధికారులను సీఎం సూచించారు. ఫిబ్రవరి కి మొత్తం 19 లక్షల ఇల్లు పూర్తి కావాలని ముఖ్య మంత్రి తెలిపారు.