రాజకీయం

Breaking News|145 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిక

తెలుగునంది విడపనకల్ మండలం : పాల్తూరు గ్రామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 150కుటుంబాలు మరియు ముగ్గురు వైసీపీ ప్రధాన కుటుంబాల నాయకులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల శ్రీనివాసులు గారు, శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పయ్యావుల కేశవ్ గారి సమక్షంలో వారి స్వగృహంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరినారు. పాల్గొన్న బీడీ మారయ్య మరియు ఎంపీటీసీ కుమారస్వామి తదితరులు.

టిడిపి పార్టీలోకి చేరినవారు మాట్లాడుతూ పయ్యావుల సోదరులు చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరినాము అని తెలియచేసారు. ఒక్క జీబీసీ కాలువ ఆధునీకరణ చేయడంతోనే మా గ్రామానికి అదనంగా 3వేల ఎకరాలకు సాగునీరు అందచేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. వారు అతి దగ్గరలోనే మరింత మంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతారన్నారు.

పార్టీలోకి చేరినవారు..
టి.గోపాల్, సుధాకర్, వన్నూరుస్వామి, పెద్దరామ
పయ్యావుల కేశవ్న్న, గాలేప్పగారి వన్నూరప్ప, రామాంజనేయులు, కరబసప్ప, ఎస్సీ కాలనీ జి.నగేష్, హరిజన చెన్నయ్య తదితర కుటుంబాలు.