లైఫ్ స్టైల్

అంతర్జాతీయ యోగా డే..యోగ సాధకులతో కలిసి zptc సభ్యుడు శ్రీకాంత్ యోగాసనాలు.

తెలుగునంది కందుకూరు: అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా స్థానిక కందుకూరు మండలంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దినోత్సవాన్ని ఘనంగా జరుపున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా  చైర్మన్, zptc మెంబెర్ అసోసియేషన్, కందుకూరు ..కంచర్ల శ్రీకాంత్ గారు హాజరై యోగశానాలు వేశారు.. యోగ నిపుణులు బివి రమణ గారు పాల్గొన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ..ముందుగా రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. వేగవంతంగా మారుతున్న నేటి కాలంలో యోగా.. వ్యక్తుల శరీరం, మెదడు, ఆత్మలను ఒక్కటిచేసి ప్రశాంతతకు దోహదపడుతుందని అన్నారు. ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడంతో ప్రపంచం మొత్తం యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుందని శ్రీకాంత్  పేర్కొన్నారు. వాస్తవానికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నిర్వహించే అతి పెద్ద ప్రజా ఉద్యమాలలో యోగా డే ఒకటిగా మారిందని ఆయన ప్రశంసించారు.

 

Add Comment

Click here to post a comment