లైఫ్ స్టైల్

అమ‌రావ‌తి అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు..! చంద్రబాబు విజన్‌కు వాళ్లు ఫిదా..! వాళ్ళు ఎవరు?

తెలుగునంది న్యూస్: వాళ్లంతా హైకోర్టు న్యాయమూర్తులు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించాల్సిన వాళ్లు. వాళ్లు… అమరావతి సందర్శనకు వచ్చారు. శూన్యం నుంచి పుట్టుకు వస్తున్న అమరావతి నగరాన్ని చూసి.. ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుత ప్రగతి … ఇంత త్వరగా సాధ్యమా అని ఆశ్చర్యపోయారు. తాత్కాలిక హైకోర్టు నిర్మాణ ప్రగతిని పరిశీలించే నిమిత్తం శనివారం అమరావతిని చీఫ్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు. అమరావతిలోని నేలపాడు రెవెన్యూ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న జుడీషీయల్‌ కాంప్లెక్స్‌ పనులను చీఫ్‌ జస్టిస్‌ బీ రాధాకృష్ణన్‌ బృందం పరిశీలించింది. ఆ కాంప్లెక్స్‌ వెలుపల, లోపల జరుగుతున్న పనులను న్యాయమూర్తులు నిశితంగా గమనించారు. కోర్టు హాళ్ల ను పరిశీలించి తగిన సూచనలు చేశారు. కాంప్లెక్స్‌ మధ్య భాగంలో కడుతున్న ఓ నిర్మాణం గురించి చీఫ్‌ జస్టిస్‌ ఆసక్తిగా ఆరా తీశారు.

అక్కడ గ్లాసెస్‌ ఏర్పాటుచేస్తామని అధికారులు ఆయనకు తెలిపారు. ఫర్నిచర్‌, కోర్టు హాళ్ల డిజైన్‌, న్యాయమూర్తుల చాంబర్లు, అడ్వకేటు కార్యాలయాలు, ఫుల్‌ కోర్టు సమావేశ మందిరం, రాకపోకల మార్గం తదితర అంశాలకు సంబంధించిన విషయాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. న్యాయమూర్తు లు, న్యాయవాదులు, ప్రజలు కోర్టులోకి ప్రవేశమార్గాల గురించి, కాంప్లెక్స్‌లో వారికి అనువైన స్థలాల గురించి తెలుసుకున్నారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన డిజైన్‌లను వారు పరిశీలించారు. న్యాయమూర్తుల నివాసాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. అసలు హైకోర్టు భవనం పూర్తయిన తర్వాత ఈ భవవాన్ని జిల్లా కోర్టులుగా ఉపయోగిచుకుంటారు.

తాత్కాలిక హైకోర్టు నిర్మాణ ప్రగతి, ఇతర సౌకర్యాలపై ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ హైకోర్టుకు వచ్చే అవకాశం నాకు ఉండకపోవచ్చు. అవకాశం ఉంటే నేను తప్పనిసరిగా వచ్చేవాడిని. అంత బాగా ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తాము మూడు వారాల కిందట వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు పనుల వేగం బాగా పెరిగిందని న్యాయమూర్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Add Comment

Click here to post a comment