ఆరోగ్యం రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే బెస్ట్ హబ్‌గా రూపొందించాలనేది నా లక్ష్యం – చంద్రబాబు

వ్యవసాయం, ఉద్యానవన పంటలు, ఆక్వా రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే బెస్ట్ హబ్‌గా రూపొందించాలనేది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

సాంకేతిక సహాయం, తక్కువ ఖర్చు, మేలైన నాణ్యత ప్రమాణాలతో అధిక దిగుబడులు సాధించడానికి తగిన శాస్త్రీయ పద్ధతులతో కూడిన నివేదిక సమర్పించాలని పిలిఫ్పీన్స్‌కు చెందిన ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ అధికారులను సీఎం కోరారు.

వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన ఇంటర్ నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ మాధ్యూ మోరెల్ ఆంధ్రప్రదేశ్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపనకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.