ఆరోగ్యం ఫోటో గ్యాలరీ రాజకీయం లైఫ్ స్టైల్ వీడియోస్

ఉగాది పచ్చడి చేసే విధానం 

తెలుగునంది ఉగాది స్పెషల్ :  ఉగాది పచ్చడి చేసే విధానం

ఉగాది పచ్చడి చాల రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగాముగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారము-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగట్నాల) పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయంత, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు-అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.

మా మిత్రులందరికి ఉగాది శుభాకాంక్షలు, మమల్ని ఇంతగా ఆదరణ & సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి  వారికీ పేరు పేరు మా తెలుగునంది కృతజ్ఞతలు తెలుపుతుంది.

Add Comment

Click here to post a comment